బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ (98) కన్నుమూశారు. వయసు మీదపడటంతో వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, గత కొంతకాలంగా శ్వాస సంబంధ ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరారు, ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.

బాలీవుడ్‌లో దిలీప్ కుమార్‌కు ట్రాజెడీ కింగ్‌గా పేరుంది. దాదాపు 60 ఏళ్ల పాటు ఆయన సినిమాలు చేశారు. ఇప్పటి వరకు 65 సినిమాల్లో నటించారు. దేవదాస్, నయా దౌర్, మొగల్ ఇ అజామ్, గంగా జమునా, క్రాంతి, కర్మ చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. చివరగా 1998లో వచ్చిన 'ఖిలా' అనే సినిమాలో దిలీప్ కుమార్ నటించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)