ఫిల్మ్‌ఫేర్ సోషల్ మీడియా పేజీ రానా దగ్గుబాటి ఫోటోతో చేసిన ఒక పోస్టుకు రానా కూడా రియాక్ట్ అయ్యారు. ఆ ఫిల్మ్‌ఫేర్ వారు చేసిన ఓ తప్పిదానికి రానా సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చారు. రానా దగ్గుబాటి లేటెస్ట్ మల్టీలింగ్వల్ మూవీ తెలుగులో 'అరణ్య' గా, తమిళంలో 'కాడన్' మరియు హిందీలో 'హాథీ మెరే సాథీ' టైటిల్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు చెందిన ఒక స్టిల్, రానా దగ్గుబాటి దిగాలుగా చూస్తున్న ఒక ఫోటోను తీసుకొని ఫిల్మ్‌ఫేర్ వారు ' కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పట్ల మా రియాక్షన్' అంటూ ట్వీట్ చేశారు. అయితే అందులో రానా దగ్గుబాటి పేరును 'రానా దాగుబట్టి' అని తప్పుగా రాశారు. అది చూసిన రానా, అదే ఫోటోను రీట్వీట్ చేస్తూ 'ప్రతీసారి మీరు నా పేరు స్పెల్లింగ్‌ను తప్పుగా రాసినపుడు నా రియాక్షన్ కూడా అదే' అని చమత్కరించారు. రానా ఫన్నీ కౌంటర్‌తో ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతమైన షేర్లు, కమెంట్లతో వైరల్ అవుతోంది. ఇదే ఆ పోస్ట్..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)