Hyderabad, Mar 2: బుల్లితెరపై సంచలనం సృష్టించిన చక్రవాకం (Chakravakam), మొగలిరేకులు (Mogalirekulu) సీరియల్స్‌ ద్వారా ప్రేక్షకులకు చేరువై ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్ (Pavitranath Passed Away) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇంద్రనీల్‌ భార్య మేఘన సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. 'పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతోన్నాం.. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి.. మేం ఈ వార్త విన్న తరువాత.. ఇది నిజం కాదని, కాకూడదని కోరుకున్నాను. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నీ ఫ్యామిలీకి ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి' అంటూ ఇంద్రనీల్, మేఘన ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. అయితే, పవిత్రనాథ్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Krish in Drug Case: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ రక్త, మూత్ర నమూనాల సేకరణ.. ఇతర నిందితుల కోసం వివిధ రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు

 

View this post on Instagram

 

A post shared by Meghna Raami (@raamimeghna)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)