Hyderabad, Dec 15: గ్యాస్ సిలిండర్ ఈకేవైసీ (EKYC)కి గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల (Gas Agency) వద్దకు రావాల్సిన అవసరం లేదని, డెలివరీ బాయ్‌ల (Delivery Boys) వద్దే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధికారులు వినియోగదారులకు సూచించారు. కేవైసీ కోసం గుంపులుగా ఆఫీసులకు వచ్చి ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. గ్యాస్ కేవైసీకి ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించిందని, వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)