Newdelhi, Mar 22: భారత్ (India) లో గత కొన్నేండ్లుగా సంతానోత్పత్తి రేటు (Fertility Rate) భారీగా తగ్గిపోతున్నట్టు లాన్సెట్ జర్నల్ (Lancet) లో ప్రచురితమైన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్(జీబీడీ) అనే సంస్థకు చెందిన పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మన దేశంలో 1950 సంవత్సరంలో 6.2గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 2.0 దిగువకు తగ్గిపోయిందని ఈ అధ్యయనం పేర్కొన్నది. ఇది మరింత తగ్గబోతున్నదని, 2050 నాటికి 1.29కి, 2100 సంవత్సరానికికి 1.04కి తగ్గుతుందని అంచనా వేసింది. పేద దేశాల్లో సంతానోత్పత్తి రేటు పెరుగుతున్నట్టు అధ్యయనం తెలిపింది.
By 2050, one in five Indians will be a senior citizen while there will be fewer younger people to take care of them, predicts new studyhttps://t.co/mivDdlKmvT
— The Indian Express (@IndianExpress) March 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)