మధ్యప్రదేశ్‌లో అత్యంత అవమానకర ఘటన బయటపడింది. భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న ఈ రాష్ట్రంలో అదే పార్టీకి చెందిన ఓ నేత చేసిన ఓ సిగ్గుమాలిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే, ఓ గిరిజన యువకుడిపై బీజేపీ నేత మూత్ర విసర్జన చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేస్తున్న నిందితుడి పేరు ప్రవేశ్ శుక్లా. ఇతపే బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా ఎమ్మెల్యే సన్నిహితుడు. అయితే ఈ ఘటననను ఎమ్మెల్యే కేదార్ శుక్లా ఖండించారు. సీఎం శివరాజ్ కుమార్ సైతం తనను వివరణ అడిగారని, అందుకే అతను నా ప్రతినిధి కాదని చెప్పానని అన్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే, నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదు. గిరిజనులపై బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన బీజేపీ నేత వీడియో బయటపడడంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయంపై దృష్టి సారించారు. బీజేపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శివరాజ్ ఆదేశాలు జారీ చేశారు. సిఎం శివరాజ్ ట్వీట్ చేసి ఇలా వ్రాశారు- 'సిధి జిల్లా వైరల్ వీడియో నా దృష్టికి వచ్చింది. దీనిపై నిందితుడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారులకు ఆదేశాలు ఇచ్చానని పేర్కొన్నారు.
గిరిజన యువకునిపై హృదయవికార ఘటన 😡😡
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది,
నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లా తరుపు వ్యక్తి అని తెలిసింది...
ఇటువంటి సన్నసులను బహిరంగంగా ఉరి తీయాలి@PMOIndia @rashtrapatibhvn @RahulGandhi @priyankagandhi @OfficeOfKNath pic.twitter.com/VNR9tVRYPo
— Balu Tumati (@Tumati_Balu) July 4, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)