New Delhi, March 03: దేశంలో కరోనా కేసులు (Corona Cases) భారీగా తగ్గాయి. కొత్తగా 6,561 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,45,160 కి చేరాయి. ఇందులో 4,23,53,620 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా(Recoveries), 5,14,388 మంది మరణించారు. మరో 77,152 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry of India) తెలిపింది.కాగా, గత 24 గంటల్లో 142 మంది కరోనా కరోనాకు బలవగా, 14,947 మంది కోలుకున్నారని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో ఉన్నాయి. రాష్ట్రంలో 2373 మందికి కరోనా సోకింది. ఇక మహారాష్ట్రలో (Maharashtra) 544 కేసులు, ఢిల్లీలో 325, తమిళనాడులో 320, ఉత్తరప్రదేశ్‌లో 216, మధ్యప్రదేశ్‌లో 259, హర్యానా 232 చొప్పున కేసులు నమోదయ్యాయి.
COVID-19 | India reports 6,561 new cases, 142 deaths and 14,947 recoveries; Active caseload stands at 77,152 pic.twitter.com/e3YA993QYG
— ANI (@ANI) March 3, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)