New Delhi, June 19: నీట్ ప‌రీక్ష‌పై (NEET) వివాదం ర‌గులుతున్న స‌మ‌యంలో కేంద్ర విద్యాశాఖ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 18న నిర్వ‌హించిన యూజీసీ నెట్-2024 (UGC-NET) ప‌రీక్ష‌ను ర‌ద్దు (cancelled) చేసింది. ఈ మేర‌కు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప‌రీక్ష‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు గుర్తించ‌డంతో ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలిపింది. అంతేకాదు త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. ప‌రీక్షా ప‌త్రం లీక్ అయిన‌ట్లు ప‌క్కా స‌మాచారం ఉండ‌టంతో దీనిపై సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీతో (CBI) ద‌ర్యాప్తు చేయించాల‌ని నిర్ణ‌యించారు.

ఈ నెల 18న దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించిన యూజీసీ నెట్-2024 (UG-NET cancelled) ప‌రీక్ష కోసం మొత్తం 11.21 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్ధులు అప్లై చేసుకోగా...317 న‌గ‌రాల్లో పరీక్ష జ‌రిగింది. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ఈ పరీక్ష‌ను చేప‌ట్టారు. ఈ ప‌రీక్ష‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వ‌ర్యంలో కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ గా నిర్వ‌హించారు.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)