Hyderabad, Dec 29: యూజర్ల వ్యక్తిగత డాటా (Personal Data) తొలగింపు, ఆన్‌ లైన్‌ సేవలకు (Online Services) సంబంధించి కేంద్రం కీలక నిబంధనల్ని తీసుకురాబోతున్నది. యూజర్ల ఖాతాలు మూడేండ్లపాటు క్రియారహితంగా (ఇనాక్టివ్‌) ఉంటే, యూజర్ల వ్యక్తిగత డాటాను ఆన్‌ లైన్‌ వేదికలు శాశ్వతంగా తొలగించే విధంగా నిబంధనలకు రూపకల్పన చేసింది. 18 ఏండ్లలోపు వారి విషయంలోనూ తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకున్నాకే, వారికి ఆన్‌ లైన్‌ సేవలను వర్తింపజేయాలన్న నిబంధనను తీసుకువస్తున్నది. డిజిటల్‌ పర్సనల్‌ డాటా ప్రొటెక్షన్‌ (డీపీడీపీ) యాక్ట్‌ లో ఈ ముసాయిదా నిబంధనలను చేర్చింది. వీటిని ఇంకా విడుదల చేయాల్సి ఉన్నది. డీపీడీపీ చట్టానికి ఈ ఏడాది ఆగస్టులోనే పార్లమెంట్‌ ఆమోదం లభించినప్పటికీ పలు క్లాజులకు అదనపు నిబంధనలు జోడించారు.

Telangana: ఆధార్ కార్డ్ లింకు చేసుకోడానికి జనాలు బారులు, ఈ సేవాకేంద్రం వద్ద చెప్పులతో భారీ క్యూలైన్‌ ఇదిగో.. 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)