జ‌మ్మూక‌శ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉన్న ఆరేహ్ మోహ‌న్‌పురాలో ఉన్న ఎలాహి దేహ‌తి బ్యాంక్ మేనేజ‌ర్ ను ఉగ్ర‌వాదులు హ‌త‌మార్చారు. మేనేజ‌ర్ క్యాబిన్‌లో ఉన్న విజ‌య్ కుమార్‌ను ఓ ఉగ్ర‌వాది త‌న చేతుల్లో ఉన్న తుపాకీతో కాల్చేశాడు. రెండు రౌండ్ల కాల్పులు జ‌రప‌డంతో.. మేనేజ‌ర్ అక్క‌డే కుప్ప‌కూలిపోయాడు. అయితే గాయాలు తీవ్రం కావడంతో ఆయ‌న్ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఉగ్ర‌వాది త‌న బ్యాగులో తుపాకీ పెట్టుకుని .. మేనేజ‌ర్ రూమ్‌లోకి వ‌స్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫూటేజీకి చిక్కాయి. మేనేజ‌ర్ క్యాబిన్ వ‌ద్ద‌కు ఉగ్ర‌వాది చేరుకుని అత్యంత స‌మీపం నుంచి కాల్పులు జ‌రిపాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ పుటేజీవీడియో వైరల్ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)