బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందువులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిగ్గు శరం లేని హిందువులు హైదరాబాద్‌లోనే ఉన్నారని, హిందువులు చీము, నెత్తురు లేని నా కొడుకులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన దుర్గమ్మ, ముత్యాలమ్మ విగ్రహాల ధ్వంసం ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు.
హిందువులు పిచ్చోళ్లు.. హిందువుల్లో మగతనం చచ్చిపోయిందంటూ మండిపడ్డారు. ఒక్క హిందూ పిచ్చోడు కూడా ఎందుకు మసీద్ మీద దాడి చేయడం లేదన్నారు. హిందువులకు సిగ్గు, శరీరం, రక్తం మరిగినప్పుడే దేవాలయాలపై దాడులు ఆగుతున్నాయన్నారు. హిందు దేవతా విగ్రహాల ధ్వంసం జరిగిన సందర్భంలో పోలీసులు పిచ్చోళ్ళను నిందితులుగా చూపుతున్నారని, అలాగైతే నగరంలో ఉన్న లక్ష మంది హిందూ పిచ్చోళ్ళు మసీద్ లపై ఎందుకు దాడి చేయడం లేదని నిలదీశారు. ఆలయాలపై దాడులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. ఇతర మతస్తులకు, ముఖ్యంగా ఒవైసీ సోదరులు ఆలయాలపై దాడులను ప్రోత్సహించకుండా చోరవ తీసుకుని మత సామరస్యాన్ని కాపాడాలన్నారు.
హిందువుల్లో మగతనం చనిపోయింది : బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి
హిందువుల్లో మగతనం చనిపోయింది : బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి
సిగ్గు శరం లేని హిందువుల జాతి హైదరాబాద్ లోనే ఉంది.
హిందువుల రక్తం మరిగినప్పుడే హిందూ దేవుళ్లపై దాడులు జరగవు.
హిందువులకు చీము నెత్తురు లేదు.
ఒక్క హిందువు కూడా మసీదుపై దాడి చేయడం లేదు ఎందుకు ?
బీజేపీ ఎమ్మెల్యే… pic.twitter.com/LLEx9coi7e
— BIG TV Breaking News (@bigtvtelugu) October 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)