అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో మరోసారి గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నెల 16న ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున రెండు కార్లలో వచ్చిన ఆరుగురు వక్తులు శ్రీ తులసి మందిర్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని పెద్ద సుత్తితో పగులకొట్టి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. 25-30 మధ్య వయసున్న ఆరుగురు వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారు అక్కడి నుంచి కార్లలో పారిపోయినట్లు చెప్పారు. నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)