దేశ వ్యాప్తంగా అందరి చూపు ఉత్తరప్రదేశ్‌పైనే ఉంది. ఇక గోరఖ్‌పూర్‌ అర్బన్‌ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటిసారి యోగి ఆదిత్యానాథ్‌ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. ఇక ఆయన సమీప అభ్యర్థిగా ఎస్పీ నుంచి సుభావతి శుక్లా పోటీ చేస్తున్నారు.  ఇక మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ఈ ఎన్నికల్లో కర్హాల్ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తాజా ఓట్ల లెక్కింపు వివరాల ప్రకారం చూస్తే.. ఈ నియోజకవర్గంలో ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ భాగెల్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక్కడ అఖిలేష్ గెలుపు ఖాయమనే కూడా వెల్లడించాయి. ఇక ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)