Lucknow January 19: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Samajwadi Party Chief Akhilesh Yadav) ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రస్తుతం అజాంగర్ ఎంపీ(MP from Azamgarh)గా ఉన్న ఆయన...నేరుగా ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. కేవలం శాసనమండలిలో సభ్యుడిగా మాత్రమే కొనసాగారు. అయితే ఈసారి అలా కాకుండా నేరుగా పోటీలో ఉండాలని భావిస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశముంది. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi adithyanath) కూడా గోరఖ్‌పూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు.
Samajwadi Party Chief and MP from Azamgarh (UP) Akhilesh Yadav will contest Uttar Pradesh Assembly elections 2022, says party source to ANI
(File pic) pic.twitter.com/aFqNG9UpnO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 19, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)