Lal Bahadur Shastri Jayanti 2021: గాంధీ, శాస్త్రిలకు ట్విట్టర్ ద్వారా ఘనంగా నివాళి అర్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్, వారి సేవలను కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి

నేడు జాతిపిత మహత్మాగాంధీ 152వ జయంతి, మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి 117వ జయంతిని పురస్కరించుకొని.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాస్త్రి సేవలను స్మరించుకున్నారు.

Lal Bahadur Shastri Jayanti 2021: గాంధీ, శాస్త్రిలకు ట్విట్టర్ ద్వారా ఘనంగా నివాళి అర్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్, వారి సేవలను కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి
AP Chief Minister YS Jagan | File Photo

నేడు జాతిపిత మహత్మాగాంధీ 152వ జయంతి, మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి 117వ జయంతిని పురస్కరించుకొని.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాస్త్రి సేవలను స్మరించుకున్నారు. ‘భారత మాజీ ప్రధాని, జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ఒక్కటిగా నిలిపిన ధీరోదాత్తుడు లాల్‌ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేశారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి గ్రామ/వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా రాష్ట్రంలో రెండేళ్ల కిందటే అడుగులు పడ్డాయని అన్నారు. నేటి నుంచి `క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌`కు శ్రీ‌కారం చుడుతున్నామని తెలిపారు. మ‌హాత్ముడి జ‌యంతి సంద‌ర్భంగా ఆయనకు నివాళులు అంటూ ట్వీట్‌ చేశారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 02, 2021 11:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).