Ayodhya, Jan 16: అయోధ్య రామమందిరంలో (Ayodhya Temple) బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ప్రయాశ్చిత్త, కర్మకుటి పూజలు జరగనుండగా.. రేపు ఆలయ ప్రాంగణంలోకి విగ్రహం ప్రవేశించనుంది. అలాగే, ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని (Sriram Idol) గుర్భగుడిలోకి చేర్చనున్నారు. ఆ రోజు తీర్థపూజ, జలయాత్ర, గంధాదివాస్ పూజలు చేయనున్నారు. అలాగే, 19వ తేదీన ఔషధదివాస్, కేసరిదివాస్, గ్రితదివాస్, ధాన్యదివాస్ పేరుతో పూజలు జరుగనున్నాయి. ఇక, 20వ తేదీన షర్కారదివాస్, ఫలదివాస్, పుష్కదివాస్.. 21న మధ్యదివాస్, శయ్యదివాస్ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక, 22వ తేదీ మధ్యాహ్నం 12:20 గంటలకు రాంలాలా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.
Man Suicide in Temple: ఆలయంలో గొంతు కోసుకుని భక్తుడు ఆత్మహత్య.. మధ్యప్రదేశ్ లో ఘటన
Ram Mandir Pran Pratishtha: Rituals for consecration ceremony to commence today | Here's seven-day schedule#RamMandir #RamTemple #Ayodhya #PranPratishtha #RamTempleconsecrationhttps://t.co/q8QetgYXai
— IndiaTV English (@indiatv) January 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)