Newdelhi, Nov 5: ఈ నెల 19న ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని ఖలిస్థాన్ తీవ్రవాది గుర్ పత్వంత్ సింగ్ పన్ను (Gurpatwant Singh Pannu) హెచ్చరించారు. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని మేము సిక్కులను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ దిగ్బంధం ఉంటుంది. మీ ప్రాణాలకు ప్రమాదం’ అని గుర్‌పత్వంత్ ఒక వీడియోలో హెచ్చరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నవంబర్ 19న ఢిల్లీ విమానాశ్రయాన్ని మూసేయనున్నట్టు.. దాని పేరును మార్చనున్నట్టు గుర్ పత్వంత్ చెప్పారు. అదే రోజు క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుండటాన్ని గుర్తుచేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం నుంచి మోదీ పాఠాలు నేర్చుకోకపోతే అలాంటి ప్రతిస్పందనే భారత్‌లో ఎదుర్కోవాల్సి ఉంటుందని గత నెల 10న గుర్‌పత్వంత్ ప్రధాని మోదీకి హెచ్చరికలు చేశారు.
Don’t fly Air India after November 19, life at risk: Pannun to Sikhshttps://t.co/8fCxkP38w2
— MSN India (@msnindia) November 4, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)