Newdelhi, July 11: అత్యాచారాల కేసుల్లో (Rape Cases) లైంగిక సామర్థ్య పరీక్షకు (Potency Test) వీర్యం సేకరణ, బాధితురాలికి ‘రెండు వేళ్ల’ పరీక్ష (Virginity Test) విధానాన్ని మద్రాస్‌ హైకోర్టు (Madras Highcourt) తీవ్రంగా తప్పుబట్టింది. సైన్స్‌ అభివృద్ధి చెందిన నేటి కాలంలోఇలాంటి పరీక్షలు అవసరం లేదని, ఇందుకు సమాన ప్రక్రియ పద్ధతులను రూపొందించాలని ఆదేశించింది. లైంగిక సామర్థ్య పరీక్షల్లో వీర్య సేకరణ విధానానికి బదులుగా రక్త నమూనాను సేకరించవచ్చని, ఇలాంటి అధునాతన పద్ధతులు ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్నారని వ్యాఖ్యానించింది. మైనర్‌ బాలిక, మైనర్‌ బాలుడికి సంబంధించిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం ఇటీవల ఈ ఆదేశాలు జారీ చేసింది.  కేసు తదుపరి విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది.

వివాహం చట్టబద్దం కాకపోయినా రెండవ భార్యకు నెలవారీ భరణం చెల్లించాల్సిందే, సెకండ్ వైఫ్ మెయింటెనెన్స్‌పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)