Mumbai, Sep 25: మహారాష్ట్రలోని (Maharastra) నాందేడ్ (Nanded) జిల్లా వ్యక్తి పట్టువదలకుండా ప్రయత్నించి ఎట్టకేలకు ప్రభుత్వోద్యోగం (Government Job) సాధించారు. 23 సార్లు ప్రభుత్వ నియామక పరీక్షల్లో విఫలమైన సాగర్ నిరాశ చెందక తన ప్రయత్నాలను కొనసాగించి ఎట్టకేలకు విజయం అందుకున్నారు. ఇటీవల 24వ ప్రయత్నంలో ఏకంగా రెండు ప్రభుత్వోద్యోగాలను సాధించారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో 25వ ర్యాంకు సాధించి ట్యాక్స్ అసిస్టెంట్‌ గా, మంత్రుల కార్యాలయంలో క్లర్క్‌ గా ఆఫర్ పొందారు. సాగర్ స్వస్థలం జిల్లాలోని మాతల గ్రామం. తమ గ్రామంలో మొదటి ప్రభుత్వోద్యోగి సాగర్ కావడంతో గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేశారు.

Jobs Representational Image (File Photo)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)