Lucknow, Dec 25: గవర్నర్ పర్యటన సందర్భంగా చనిపోయిన ఉద్యోగికి డ్యూటీ వేశారు. (Assigning Duty To Dead Employee) ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఒక క్లర్క్ (Clerk) ను సస్పెండ్ (Suspend) చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 26న ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ బల్లియాను సందర్శించారు. జననాయక్ చంద్రశేఖర్ యూనివర్శిటీ ఐదవ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అయితే గవర్నర్ ఆనందీబెన్ పటేల్ బల్లియా పర్యటన సందర్భంగా చనిపోయిన ఒక ఉద్యోగికి డ్యూటీ కేటాయించారు. దీంతో గవర్నర్‌కు వడ్డించే ఆహారాన్ని పరీక్షించే బాధ్యత ఎవరూ చూడలేదు. కాగా, ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. బల్లియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయంలో పనిచేస్తున్న క్లర్క్, ఘటనకు బాధ్యుడు బ్రిజేష్ కుమార్ ను శనివారం సస్పెండ్ చేశారు.
Clerk suspended for allotting duty to deceased employee during UP Governor's visit https://t.co/hwCJyyEJn0
— Devdiscourse (@Dev_Discourse) December 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)