Tiruvanantapuram, September 23: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, వ్యవస్థీకృత శిక్షణ, తీవ్రవాద భావజాలం వ్యాప్తి వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యాలయాలు, దాని సభ్యుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో దాడులు జరిగాయి. దాడులను వ్యతిరేకిస్తూ పీఎఫ్ఐ సిబ్బంది కేరళలోని పలు ప్రాంతాల్లో బస్సులపై రాళ్ళు రువ్వారు. దీంతో ఓ డ్రైవర్ తలకు హెల్మెట్ పెట్టుకొని బస్సు నడుపుతున్న వీడియో వైరల్ గా మారింది.
A KSRTC driver in Kerala has no other option to save his life as widespread stone pelting is reported in PFI hartal. A scene from Aluva, Kerala #News9SouthDesk pic.twitter.com/dbYiG1iuaN
— Jisha Surya (@jishasurya) September 23, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)