Hyderabad, October 1: అటవీ మార్గం నుంచి కొందరు ఓ వాహనంలో వెళుతున్నారు. మధ్యలో రోడ్డుకు అడ్డంగా ఓ పెద్ద కొండ చిలువ పడుకుని ఉంది. దాని జోలికి వెళితే మన పని అంతే అన్నంత పెద్దగా ఉంది. సాధారణంగా హారన్ కొట్టడం, కాస్త దగ్గరగా వాహనాన్ని తీసుకెళ్లడం వంటి చేస్తే రోడ్డు మీద నుంచి పాము వెళ్లిపోతుంది. కానీ అలా చేసినా ఆ కొండ చిలువ అలాగే పడుకుని ఉంది.  ఇంతలో వాహనంలోంచి ఓ వ్యక్తి ధైర్యంగా దిగి కొండ చిలువ దగ్గరికి వెళ్లి ఒట్టి చేత్తో దాన్ని పట్టుకొని పొదల్లోకి విసిరేశాడు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కాశ్వాన్ ఈ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)