IND vs IRE 2nd T20I 2022: టెన్సన్ పెట్టిన పసికూన, ఐర్లాండ్‌తో రెండో టి20లో 4 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు, 2–0తో సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా

ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో భారత్‌ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి 2–0తో సిరీస్‌ సొంతం చేసుకుంది.

IND vs IRE 2nd T20I 2022: టెన్సన్ పెట్టిన పసికూన, ఐర్లాండ్‌తో రెండో టి20లో 4 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు, 2–0తో సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా
India Team

ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో భారత్‌ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి 2–0తో సిరీస్‌ సొంతం చేసుకుంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్‌ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, సంజు సామ్సన్‌ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సత్తా చాటాడు. అనంతరం ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఆండీ బల్బర్నీ (37 బంతుల్లో 60; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), పాల్‌ స్టిర్లింగ్‌ (18 బంతుల్లో 40; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), హ్యారీ టెక్టర్‌ (28 బంతుల్లో 39; 5 ఫోర్లు), డాక్‌రెల్‌ (16 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 29, 2022 10:00 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).