బెంగుళూరు వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. 1998 తర్వాత తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఒక టెస్ట్ మ్యాచులో ఓడిపోయింది. అయితే ఐదో రోజు 107 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో కివీస్ ఆటగాళ్లు తడబడ్డారు. ఈ రోజు ప్రారంభంలో టీమ్ ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత్ లో ఆశలు రేపాడు. కివీస్ టీమ్ కెప్టెన్ టామ్ లాథమ్ ను రెండో బంతికే LBW ఔట్ చేశాడు. మొదట అంపైర్ ఔట్ ఇవ్వకపోయినా, కెప్టెన్ రోహిత్ శర్మ అప్పీల్ చేయడంతో థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించారు.
Who else but Bumrah?! ⚡
Catch the thrilling finale to the first #INDvNZ Test, LIVE on #JioCinema, #Sports18 & #ColorsCineplex#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/NDEGpW64Se
— JioCinema (@JioCinema) October 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)