తిరువనంతపురం వన్డేలో భారత జట్టు 317 పరుగుల తేడాతో శ్రీలంకపై భారీ విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. అత్యంత అధిక పరుగుల తేడాతో వన్డే క్రికెట్‌లో ఇదే అతిపెద్ద విజయం. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీ జట్టు శ్రీలంకను క్లీన్ స్వీప్ చేసింది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న భారత్, శ్రీలంక మూడు వన్డేల సిరీస్ చివరి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. జట్టులో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లి అత్యధికంగా 110 బంతుల్లో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో పాటు యువ గిల్ కూడా సెంచరీ సాధించాడు. శుభ్‌మన్ గిల్ 97 బంతుల్లో 116 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు శ్రీలంక గెలవాలంటే నిర్ణీత ఓవర్లలో 391 పరుగులు చేయాలి. అయితే శ్రీలంక బ్యాటింగులో తడబడింది. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా చెలరేగిపోయాడు. సిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు. ఆ తర్వాత రనౌట్ కూడా చేశాడు.
??????? ??? ?? ?????? ?? ???? ?? ????!#TeamIndia register a comprehensive victory by 3️⃣1️⃣7️⃣ runs and seal the @mastercardindia #INDvSL ODI series 3️⃣-0️⃣ ??
Scorecard ▶️ https://t.co/q4nA9Ff9Q2……… pic.twitter.com/FYpWkPLPJA
— BCCI (@BCCI) January 15, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)