TAROUBA January 19: అండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్న భారత యువ జట్టులో కరోనా కలకలం రేపింది. కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ సహా మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వీరంతా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు దూరమయ్యారు. కెప్టెన్ యశ్ ధుల్ గైర్హాజరీలో ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు నిశాంత్ సంధు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఐర్లాండ్ తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్.. 40 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు రఘువంశీ(79), హర్నూర్ సింగ్(88) శుభారంభాన్ని అందించారు.
India captain Yash Dhull, five other players test positive for COVID-19 at ICC Under-19 cricket World Cup in West Indies: BCCI official
— Press Trust of India (@PTI_News) January 19, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)