వన్డే ప్రపంచ కప్-2023లో 12వ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌తో తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. టాస్ గెలిచిన అనంతరం ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీమ్ ఇండియాకు తొలి వికెట్ అందించాడు. స్కోరు 20 వద్ద అబ్దుల్లా షఫీక్‌ను అవుట్ చేశాడు. పాకిస్థాన్ స్కోరు 12 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 68 పరుగులు. ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం క్రీజులో నిలుచున్నారు. ఇదిలా ఉంటే మ్యాచుకు ముందు ఇరు దేశాల జాతీయ పతాకాల ప్రదర్శన జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల జాతీయ గీతాలను ఆలపించారు. భారత జాతీయ గీతం సందర్భంగా సుమారు లక్ష మంది కలిసి ఆలపించడం అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది.
More than 1,00,000 People's are Singing National Anthem of India 🇮🇳🔥#INDvsPAK | #ViratKohli𓃵 | #INDvPAK pic.twitter.com/xmqgZsVAdy
— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 14, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)