Vijayawada, May 29: ప్రకాశం (Prakasam) జిల్లా త్రిపురాంతకం (Tripuranthakam) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. కారు (Car), ఆర్టీసీ బస్సు (RTC Bus) ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. ముగ్గురు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాంగ్ రూట్ సర్వీస్‌రోడ్డు మీదుగా కారు ప్లైఓవర్ ఎక్కుతున్న క్రమంలో వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును చూసుకోకపోవడంతో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)