మాజీ ఏపీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లోచేరారు. కిడ్నీలో స్టోన్స్ సమస్యతో ఎమ్మెల్యే కొడాలి నాని, హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది. మూడు రోజుల క్రితమే నాని అపోలో ఆసుపత్రిలో చేరగా, ఆయనకు శుక్రవారం రాత్రి కిడ్నీ సంబంధిత శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కొడాలి నానికి శస్త్ర చికిత్స జరిగిందన్న వార్తలు విన్న నాని అనుచరులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు.
Kodali Nani Surgery Former Minister of Andhra Pradesh, Gudiwada MLA Kodali Nani underwent surgery due to kidney stones. It seems that he is currently in the ICU of Hyderabad Apollo Hospital and is likely to be discharged in 2-3 days. pic.twitter.com/3a7RI7Gfew
— Mana ANDHRA (@OurAndhra2) November 19, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)