ఉమ్మడి పౌర స్మృతి బిల్లును వ్యతిరేకిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోన్న యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు (యూసీసీ) వల్ల అన్ని మతాల వారిలో అయోమయం నెలకొన్నదని చెప్పారు. ప్రత్యేక సంస్కృతి కలిగిన అన్ని జాతులు, మతాలకు యూసీసీ వల్ల ఇబ్బందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధిని విస్మరించి విద్వేష రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పలు రకాలుగా ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని ఫైర్ అయ్యారు. యూసీసీ పేరుతో మళ్లీ ప్రజలను విభజించేందుకు కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)