Hyderabad, Sep 3: భారీ వర్షాలతో (Heavy Rains) మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో మెదక్ (Medak) లోని ఏడు పాయల వనదుర్గ మాత మందిరం మూడో రోజు కూడా జల దిగ్బంధంలోనే ఉంది. మంజీరా బ్యారేజ్ గేట్లు తెరువడంతో ఏ క్షణాన అయిన భారీ వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అమ్మవారి పాదాలను తాకుతూ ఏడు పాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతున్న మంజీరాను చూసేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు. కాగా, అమ్మవారి గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజారులు పూజలు చేశారు.
Here's Video
మూడో రోజు జల దిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ మాత..
మంజీరా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయడంతో ఏ క్షణాన అయిన భారీ వరద వచ్చే అవకాశం.
అమ్మవారి పాదాలను తాకుతూ ఏడు పాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతున్న మంజీరా
గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు అందుకుంటున్న అమ్మవారు. https://t.co/BjbiEIX7t8 pic.twitter.com/vZzIg7e5aO
— ChotaNews (@ChotaNewsTelugu) September 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)