Hyderabad, July 17: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ (Secundrabad ujjain mahankali) అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha). మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్యనగర్ కమాన్ నుంచి బంగారు బోనంతో (Bangaru bonam) మహంకాళి ఆలయానికి చేరుకున్నారు కవిత. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి 250 ఏళ్ల చరిత్ర ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాలకు అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందన్నారు. అమ్మవారి దయవల్ల ఈ ప్రజలంతా సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించినట్లు చెప్పారు. కళాకారుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి...మొక్కులు తీర్చుకున్నారు. 2వేల మంది మహిళలు బోనాలు ఎత్తుకొని కవిత వెంట ర్యాలీగా నడిచారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)