Hyderabad, May 31: పచ్చదనం పెంపే లక్ష్యంగా గత కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) తీసుకొచ్చిన ‘హరితహారం’ (Haritha Haram) పేరును ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ఇందిర వనప్రభ’గా (Indhira Vanaprabha) మార్చనున్నట్లు సమాచారం. వర్షాకాలం ప్రారంభం తోటే ‘హరితహారం’ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎనిమిదేండ్ల కిందట బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో మొదలుపెట్టారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పేరు మార్చాలని భావించారు. ఈ క్రమంలోనే దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరును కలుపుతూ ఇందిర వనప్రభగా ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా, 2004-14 మధ్యన ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. దాన్ని‘వన యజ్ఞం’గా పిలిచేవారు.

ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి జర్మనీ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన పోలీసులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)