Hyderabad January 22: తెలంగాణలో కరోనా కేసులు (Telangana corona cases) కాస్త తగ్గాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 4,393 కరోనా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ (Health ministry) శనివారం హెల్త్‌ బులిటెన్‌ (Health bulliten)లో తెలిపింది. మరో వైరస్‌తో ఇద్దరు మృతి చెందగా.. 2,319 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,199 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,31,212కు పెరిగింది. ఇందులో 6,95,942 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.56శాతం, రికవరీ రేటు 95.18శాతం ఉందని మంత్రిత్వ శాఖ వివరించింది. ఇవాళ ఒకే రోజు 1,16,224 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించనట్లు చెప్పింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ (Hyderabad) పరిధిలో 1643, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 421, రంగారెడ్డిలో 286, హనుమకొండలో 184 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)