Hyderabad, July 2: విభజన సమస్యలు పరిష్కరించుకుందామని, ఈ మేరకు కలిసి మాట్లాడుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu Naidu) రాసిన లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సానుకూలంగా స్పందించారు. చర్చకు సిద్ధమంటూ చంద్రబాబుకు తిరిగి లేఖ రాయనున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు ఈ నెల 6న హైదరబాద్ లో భేటీ అయ్యే అవకాశం ఉన్నది. కాగా, రాష్ట్ర విభజన జరిగి పదేండ్లయినా రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు అపరిష్కృతంగానే మిగిలి ఉన్నాయి. దీంతో ముఖాముఖిగా సమావేశమై వీటిపై చర్చించుకుందామని బాబు ప్రతిపాదించారు. దీనిపై రేవంత్ సానుకూలంగా స్పందించారు.
చంద్రబాబు లెటర్ పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూల స్పందన
నేడు చంద్రబాబుకు లెటర్ రాయనున్న సీఎం రేవంత్. ఆరవ తేదీన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ.
ప్రజాభావన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశం. https://t.co/URcfqDwg5T pic.twitter.com/Y1oZzSXmbC
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)