Newdelhi, Jan 30: కృత్రిమ మేధ (ఏఐ) (AI) సాయంతో రూపొందుతున్న డీప్ ఫేక్ (Deepfake) వీడియోలు, చిత్రాలు, ఆడియోలపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యను భయానకమైందిగా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డీప్ ఫేక్ ఆడియో, మిగతా ప్రముఖులకు చెందిన డీప్ ఫేక్ ఫొటోలు, చిత్రాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కు చెందిన డీప్ ఫేక్ అశ్లీల దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన నాదెళ్ల .. ‘నెట్టింట ఈ ట్రెండ్ అత్యంత భయానకం. టెక్నాలజీ దుర్వినియోగంపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
"Alarming, Terrible": Satya Nadella On Taylor Swift's Deepfake Images https://t.co/omQVyB30X6 pic.twitter.com/TaQ8PCQ0ye
— NDTV (@ndtv) January 29, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
