New Delhi, DEC 31: దేశ ప్రజలంతా  నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా..యూపీఐ పేమెంట్స్ (UPI Payments) నిలిచిపోయాయి. ప్రజలంతా షాపింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో యూపీఐ సేవలు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో యూపీఐకి ఏమైందంటూ ట్విట్టర్‌ లో గోల మొదలైంది. వేలాది మంది యూజర్లు #UPIDOWN అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే యూపీఐ సర్వీసుల పునరుద్దరణపై ఇంకా అధికారిక సమాచారం మాత్రం లేదు. దీన్ని త్వరగా పరిష్కరించకపోతే..చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే చాలా మందికి యూపీఐ డౌన్ (UPI Dowm) అయిందనే విషయం తెలియక పేమెంట్లు చేస్తున్నారు. దీంతో వేలాది రూపాయలు పేమెంట్ గేట్ వేలో ఇరుక్కుపోతున్నాయి. దీంతో వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయి. యూపీఐ సర్వీసులు డౌన్ అవ్వడం ఇదేమీ తొలిసారి కాదు. కానీ కీలకమైన షాపింగ్ సమయంలో ఇలా సర్వర్లు మొరాయిస్తుండటం వినియోగదారులను చికాకు పెడుతోంది.

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)