Brasília, September 6: ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో సముద్రంలో చిక్కుకున్న ఓ బాలుడు పులితో జీవన్మరణ పోరాటం చేస్తాడు. కరెక్ట్ గా అలాంటి ఘటనే ఒకటి బ్రెజిల్ కి చెందిన రోములాడో మసిడో రోడ్రోగస్ అనే వ్యక్తి జీవితంలో ఎదురైంది. చేపల వేట కోసం వెళ్లి.. నడి సంద్రంలో చిక్కుకున్న అతను.. ప్రాణాల కోసం పోరాడి.. చివరకు 11 రోజుల తర్వాత బతుకు జీవుడా.. అన్న చందంగా ఒడ్డుకు చేరుకున్నాడు. సముద్రంలో ఉన్నప్పుడు తన చుట్టూ షార్క్‌లు, తిమింగళాలు తిరిగినా భయపడకుండా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని కాలం వెళ్లదీశాడు. చివరకు అటుగా వచ్చిన కొందరు వ్యక్తులు అతన్ని కాపాడారు. ఆ వీడియో మీరూ చూడండి.
A fisherman was rescued in the Atlantic Ocean, who spent 11 days without food and water in the freezer, because his boat sank!
The man lost a lot of weight, suffered from dehydration and almost went blind. pic.twitter.com/1eYnJ09ITW
— NEXTA (@nexta_tv) September 3, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)