Colombo July 09: శ్రీలంకలో (Srilanka) పరిస్థితులు గంట గంటకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స (Gotabaya rajapaksa) అధికార నివాసంలో బీభత్సం సృష్టించారు ఆందోళనకారులు. అంతటితో ఆగకుండా ప్రధాని విక్రమసింఘే ఇంటిని ముట్టడించారు. ఆయన రాజీనామా చేసినప్పటికీ శాంతించలేదు. విక్రమసింఘే (Wickremesinghe) సొంతింటికి వెళ్లిన ఆందోళనకారులు...ఇంటికి నిప్పు పెట్టారు (protesters set ablaze). దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఇంటికి నిప్పు పెట్టార‌ని ప్ర‌ధాని కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యంలోకి వ‌చ్చిన నిర‌స‌న‌కారుల‌పై పోలీసులు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించినా వెన‌క్కి త‌గ్గ‌లేదు. ప్ర‌ధాన‌మంత్రికి చెందిన వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)