Switzerland, May 20: స్విట్జర్లాండ్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వెస్టర్న్ స్విట్జర్లాండ్ లోని (Switzerland Plane Crash) అటవీ ప్రాంతంలో టూరిస్ట్ ప్లేన్ కుప్పకూలినట్లు (Tourist Plane Crash) పోలీసులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో పైలెట్‌తో పాటూ మరో ఇద్దరు మరణించినట్లు చెప్పారు. అయితే మృతుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. పాంట్స్ డి మార్టెల్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Switzerland Plane Crash: Pilot, Two Passengers Die as Tourist Aircraft Crashes in Neuchatel#Switzerland #PlaneCrash https://t.co/NEAvhi6cSn
— LatestLY (@latestly) May 20, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)