Hyderabad, AUG 22: . స్వతహాగా చైతన్యకు ఆటో మొబైల్స్ అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి కారు రేసింగ్స్ (Car Racings) అన్నా, ఫార్ములా వన్ (Formula One) అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పటికే ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయన వెల్లడించారు. తాజాగా తనకిష్టమైన రంగంలోకి చైతన్య అడుగు పెట్టారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (IRF)లో పోటీ పడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. దీంతో ఐఆర్ఎఫ్ ఫార్ములా 4లో (IRF Formula-4) భాగమయ్యారు. ఫార్ములా 4 సీజన్‌కు సంబంధించిన రేసులు ఆగస్ట్ 24 నుంచి ప్రారంభం అవుతాయి.
ఈ సందర్బంగా అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటి నుంచి మోటార్ స్పోర్ట్స్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు. ఇక ఫార్మాలా వన్‌ను ఎంతగానో ప్రేమిస్తానన్నారు. ఫార్ములా వన్‌లోని హైస్పీడ్ డ్రామా, వేగంగా కార్లు, బైక్స్ నడపటంలోని థ్రిల్ నన్నెంతగానో ఆకట్టుకుంటుందన్నారు. ఫార్మాలావన్ పై ఉన్న ఇష్టంతోనే సూపర్ కార్స్, బైక్స్‌ను కొన్నానని చెప్పుకొచ్చారు. ఐఆర్ఎఫ్ అనేది ఈ వెంట్ కాదని, అంతకు మించిన అడ్వెంచర్ అని అన్నారు.
View this post on Instagram
తన ఫ్యాషన్‌ను చూపించుకునే చక్కటి వేదిక ఇదని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌ను (Hyderabad Blackbird) సొంతం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఫ్యాన్స్‌కు ఐఆర్ఎఫ్ అనేది మరచిపోలేని అనుభూతినిస్తుందనటంలో తనకు ఎలాంటి సందేహం లేదన్నారు. అలాగే ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ నెక్ట్స్ రేంజ్‌కి చేరుకుంటుందన్నారు.