రాష్ట్రీయం

Sankranthi 2024: పందెం కోడి ధర రూ.3 లక్షలు, గుడ్డు ధర 3 వేలు, ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు, ఆ పందెం కోడి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..

sajaya

మామూలుగా ఒక పందెం కోడి పుంజు ధర ఎంతుంటుంది. మా అంటే వెయ్యి రూపాయలు. అంతకు మించి అంటే పందెం కోళ్లకు వేలల్లో డిమాండ్ ఉంటుంది. కానీ.. ఏకంగా 3 లక్షల రూపాయల కోడి పుంజు అంటే మాత్రం ఆలోచించాల్సిందే. 3 లక్షల రూపాయల కోడి పుంజు ప్రత్యేకత ఏంటి? దాని ఒక్క కోడి గుడ్డు ధర 3 వేల రూపాయలు అట. షాకింగ్ గా ఉంది కదా

Sankranthi Holidays in AP: ఏపీలో జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు, 19న పాఠశాలలు పునఃప్రారంభం

Hazarath Reddy

అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏపీ ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 9 నుంచి 18 వరకూ సంక్రాంతి సెలవులను నిర్ణయించారు. 19న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలిచ్చారు. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

Pre Wedding Shoot in RTC Bus: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్, విభిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

హైదరాబాద్‌లో ఓ జంట ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్ జరుపుకుంది. ట్రాఫిక్‌లో ఓ బస్సు ఆగి ఉన్న సమయంలో ఓ జంట ప్రీ-వెడ్డింగ్ షూట్ జరుపుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Panjagutta Car Accident Case: పంజాగుట్ట కారు ర్యాష్ డ్రైవింగ్ కేసు, మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

పంజాగుట్ట కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో (Panjagutta Car Accident Case) బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్‌ను అరెస్ట్ చెయ్యొద్దని తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశించింది. అయితే ఈ నెల 17న సోహైల్‌ (Former MLA Shakeel Son Sahil) పోలీసుల ముందు హాజరు కావాలని తెలిపింది.

Advertisement

Telangana Road Accident: వీడియో ఇదిగో, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పాఠశాల బస్సును ఢీకొన్న లారీ, 21 మంది విద్యార్థులకు గాయాలు

Hazarath Reddy

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెబ్బన మండలం ఇంద్రానగర్‌ వద్ద పాఠశాల బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 21 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Telangana Fire: వీడియో ఇదిగో, తెలంగాణలో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెంకటరావుపేట వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు

Tamil Nadu Rains: తమిళనాడులో పది జిల్లాలకు రెడ్ అలర్ట్, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన, వరదలకు వాగుల్ని తలపిస్తున్న చైన్నై రోడ్లు

Hazarath Reddy

తమిళనాడును మరోసారి భారీ వర్షాలు (Tamil Nadu Rains) ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. వర్షానికి ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్‌, కన్యాకుమారి సహా 18 జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది.

Hospital in Medaram: మేడారంలో తాత్కాలికంగా 50 పడకల ఆసుపత్రి.. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం

Rudra

మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర సమీపిస్తున్న తరుణంలో ఏర్పాట్లపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Advertisement

Hyderabad National Book Fair: ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్.. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహణ

Rudra

పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్’ తేదీలు వచ్చేశాయి. ఈ ఏడాది 36వ బుక్ ఫెయిర్ ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు జరగనుంది.

TS Youth Dies in US: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి కన్నుమూత.. మృతుడిని ఖమ్మం జిల్లా వాసి సాయిరాజీవ్‌ రెడ్డిగా గుర్తింపు

Rudra

అమెరికాలోని టెక్సాస్‌ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన సాయిరాజీవ్‌రెడ్డి (28) ప్రాణాలు కోల్పోయాడు. విమానాశ్రయానికి వెళ్లి ఓ పార్సిల్ తీసుకొని వెనుదిరిగి వస్తుండగా సాయిరాజీవ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుని ఓ ట్రక్కు ఢీకొట్టడంతో సాయి తీవ్ర గాయాలపాలయ్యాడు.

TTD Website Update: టికెట్లు బుక్ చేసుకునే శ్రీవారి భక్తులకు అలెర్ట్‌, టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ పేరు ttdevasthanams.ap.gov.in గా మార్చిన అధికారులు

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్‌సైట్‌ పేరును మారోసారి మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు పేరు thirupathibalaji.ap.gov.in ఉండగా.. దాన్ని ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కోరింది.

TDP-Janasena Election Song: టీడీపీ జనసేన ఎలక్షన్ స్పెషల్ సాంగ్ ఇదిగో, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తలదించుకు పాటను గుర్తుకుతెస్తున్న సాంగ్

Hazarath Reddy

ఏపీలో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలు కలసికట్టుగా కదం తొక్కుతున్నాయి. రా కదలి రా పేరిట అప్పటికే బహిరంగ సభలు నిర్వహిస్తుండగా... తాజాగా భాగస్వామ్య స్ఫూర్తితో ఎలక్షన్ స్పెషల్ సాంగ్ ను నేడు విడుదల చేశారు.

Advertisement

Telangana Elections 2024: హైదరాబాద్‌కు రాజాసింగ్, పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌లు వీరే

Hazarath Reddy

తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పది కమిటీ నేతల భేటీ జరిగింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ పొలిటికల్ ఇంచార్జీలను తెలంగాణ బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Praja Palana Cabinet Sub Committee: ప్రజాపాలన ఆరు గ్యారంటీలపై ఎవరైనా కారు కూతలు కూస్తే ఊరుకోం, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హెచ్చరిక, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్‌గా భట్టి విక్రమార్క

Hazarath Reddy

ప్రజా పాలన దరఖాస్తులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. తాజాగా ప్రజాపాలన హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని (Praja Palana Cabinet Sub Committee) ఏర్పాటు చేసింది

Telangana Horror: ఆస్తి అమ్మడానికి అడ్డుగా ఉందని తల్లిపై కొడుకు దారుణం, భార్యతో కలిసి అర్థరాత్రి గొంతుకి టవల్ చుట్టి హత్య, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

ఆస్తి కోసం నవ మాసాలు మోసి కని పెంచిన కన్న తల్లిని దారుణంగా (Son kills mother with help of wife) చంపాడు ఓ కసాయి కొడుకు. ఈ హత్యకు భార్య, మరో వ్యక్తి సహకరించారు. హైదరాబాద్‌‌ ఉప్పల్‌‌లోని రామంతాపూర్‌‌‌‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Telangana Shocker: షాద్ నగర్‌లో దారుణం, కన్నతల్లిని కొట్టి చంపిన కొడుకు, అనారోగ్యంతో మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

రంగారెడ్డి(Rangareddy) జిల్లాలోని షాద్ నగర్ - కేశంపేట రోడ్డులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లినే కడతేర్చాడు(Mother death) తనయుడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం షాద్‌నగర్‌లో నివసించే సుగుణమ్మను ఆమె కొడుకు రాత్రి విచక్షణారహితంగా దాడి(Son beats) చేశాడు.

Advertisement

Andhra Pradesh Elections 2024: ఏపీలో అనర్హులుగా 5 లక్షల 64వేలకు పైగా ఓటర్ల పేర్లు, దొంగ ఓటర్లను చేర్చుతున్న 13 మందిపై కేసు నమోదు చేశామని తెలిపిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా

Hazarath Reddy

ఆయన మాట్లాడుతూ.. ఓట్ల నమోదుకు సంబంధించి డిసెంబరు 9 వరకు వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించామని ఆయన (AP CEO Mukesh Kumar Meena) చెప్పారు. డిసెంబరు 9 తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను ఈ నెల 12 లోగా పరిష్కరిస్తామని తెలిపారు.

Andhra Pradesh Politics: విజయవాడలో టీడీపీకీ మరో షాక్, కార్పొరేటర్ పదవికి, టీడీపీకి గుడ్‌బై చెప్పిన కేశినేని శ్వేత

Hazarath Reddy

విజయవాడలో టీడీపీకీ మరో షాక్ తగిలింది. టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. తన కార్పొరేటర​్‌ పదవికి, టీడీపీకి ఆమె గుడ్‌బై చెప్పారు. తాజాగా విజయవాడ మేయర్‌ భాగ్యలక్ష్మికి కేశినేని శ్వేత తన రాజీనామా లేఖను అందించారు. ఈ సందర్భంగా తన కార్పొరేటర్‌ సభ్యత్వం రాజీనామా లేఖను కౌన్సిల్లో పెట్టి ఆమోదించాలని మేయర్‌ను శ్వేత కోరారు.

Weather Forecast: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణీ, కోస్తాంధ్రకు వర్ష సూచన జారీ చేసిన వాతావరణ శాఖ, భారీ వర్షాలకు చెన్నై మరోసారి విలవిల

Hazarath Reddy

చెన్నైకి ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర జిల్లాలకు కూడా వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రస్తుతం బంగాళాతాన్ని అనుకొని ద్రోణి కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించిన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.

Telangana Road Accident Video: వీడియో ఇదిగో, కరీంనగర్ వెళ్తూ చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 26 మందికి గాయాలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు చెట్టును ఢీకొనడంతో గర్భిణి సహా 26 మందికి గాయాలైన సంఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వరంగల్‌ నుంచి కరీంనగర్‌ వెళ్తున్న బస్సు చెట్టును ఢీకొట్టింది.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement