APSRTC: ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఇకపై బస్సు నడుస్తుండగా ఖాళీ సీట్లను ముందు స్టేజీల్లో ఎక్కేవారు రిజర్వేషన్ చేసుకోవచ్చు, ఈ–పోస్‌ మిషన్లను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ
APSRTC Bus. (Photo Credits: PTI | Representative Image)

Amaravati, Oct 7: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించింది. ఇకపై ప్రయాణికులు టిక్కెట్టు కోసం నగదును చెల్లించే పని లేకుండా డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని (E-pos Digital payments) అందుబాటులోకి తెచ్చింది.క్రెడిట్, డెబిట్‌ కార్డులతో పాటు ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌)ల ద్వారా చెల్లించే వెసులుబాటునూ కల్పించింది.

విశాఖపట్నం జిల్లాలో దీనిని గత నెల ఏడో తేదీ నుంచి అమలు చేస్తున్నారు. ఇక నుంచి నేరుగా టిక్కెట్టు మొత్తాన్ని క్రెడిట్, డెబిట్‌ కార్డుల నుంచి స్వైపింగ్, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటివి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా చెల్లించవచ్చు. విశాఖ జిల్లాలో ప్రజా రవాణా శాఖ (పీటీడీ)కు 704 ఆర్టీసీ బస్సులు న్నాయి. తొలుత దూరప్రాంతాలకు నడిచే 97 (Currently implemented in 97 buses) ఎక్స్‌ప్రెస్, ఆపై (డీలక్స్, సూపర్‌ లగ్జరీ, ఇంద్ర, గరుడ, అమరావతి, డాల్ఫిన్‌ క్రూయిజ్‌ తదితర) సర్వీసుల్లో డిజిటల్‌ చెల్లింపులను అందుబాటులోకి తెచ్చారు. 580కి పైగా ఉన్న సిటీ బస్సుల్లో దశల వారీగా డిజిటల్‌ సేవలను ప్రవేశపెట్టనున్నారు.

ఏపీ ప్రభుత్వం మొత్తం 11 రకాల పెన్షన్లు అందిస్తోంది, సంక్షేమ పథకాలపై భారీ మొత్తాలను ఖర్చుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం, హైకోర్టుకు నివేదించిన సెర్ప్‌

ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో (APSRTC buses) టిక్కెట్ల జారీకి టిమ్స్‌ యంత్రాలను వినియో గిస్తున్నారు. ఇకపై వాటి స్థానంలో డిజిటల్‌ చెల్లింపులకు వీలుగా ఈ–పోస్‌ మిషన్లను సమకూరుస్తున్నారు. ఇలా విశాఖ జిల్లాకు ఇప్పటివరకు 180 ఈ–పోస్‌ మిషన్లు వచ్చాయి. వీటి వినియోగంపై డ్రైవర్లు, కండక్టర్లకు ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు.

ఏపీకి రెవిన్యూ విభాగంలో రూ. 26 వేల కోట్లు ఆదాయం, పన్ను చెల్లింపుదారులకు సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలని తెలిపిన సీఎం జగన్

ప్రయాణికులు డిజిటల్‌ చెల్లింపులే కాదు.. మున్ముందు మరిన్ని సదుపాయాలు పొందే వీలుంది. ఇప్పటివరకు బస్సు కదిలే సమయానికి రిజర్వేషన్‌ చార్టును కట్‌ చేసి డ్రైవర్‌/కండక్టర్‌కు ఇస్తున్నారు. దీంతో ఆ తర్వాత ఆ బస్సులో రిజర్వేషన్‌ ద్వారా సీటు పొందే వీలుండదు. ఇక మీదట చార్టు క్లోజ్‌ అయ్యే పనుండదు. ఈ–పోస్‌ యంత్రాల్లో అమర్చిన సాంకేతికతతో బస్సు నడుస్తుండగా ఖాళీ సీట్లను ముందు స్టేజిల్లో ఎక్కే వారు తెలుసుకుని రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. లేదా ఏటీబీ (ఆథరైజ్డ్‌ టిక్కెట్‌ బుకింగ్‌) ఏజెంట్లు, బస్సులో కండక్టర్‌/డ్రైవర్‌ కేటాయించవచ్చు. ప్రస్తుతం డిజిటల్‌ చెల్లింపులు జరుపుతున్న వారి సంఖ్య 10 శాతం ఉందని, క్రమంగా పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.