Amaravati, Oct 18: ఏపీలో బీసీల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh government) ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల ప్రకటన (BC Corporations in AP) వెలువడింది. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు , డైరెక్టర్ల పేర్లను ఆదివారం తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు. మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి. వీటిలో ఒక్కో కార్పొరేషన్‌కు చైర్మన్‌తో (bc corporation chairman posts) పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది.
మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కాగా, చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం (BC Corporation Chairman Posts in AP) కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకర్ నారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు.
ఈ కార్పొరేషన్ల ద్వారా బీసీలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏడాదికి దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. బీసీలకు అన్ని రకాల ఆర్థిక సహాయాలను ఈ కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
56 Chairpersons/672 Directors List
Our Govt led by Hon’ble @AndhraPradeshCM @ysjagan announced 56 Chairpersons/672 Directors of all BC Corporations. 4-6 Chairpersons per District & equally for men & women. Our Govt has given benefits to 2.72 Cr BC Citizens of #AP worth 34K Cr in 16 months. @osdkmr #YSJaganCares pic.twitter.com/8q2j8vQQ8N
— S. Rajiv Krishna (@RajivKrishnaS) October 18, 2020
ఆ డబ్బులు పంపిణీ చేసే అధికారాన్ని కూడా కార్పొరేషన్ ఎండీకి ఇవ్వనుంది. జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు పొందే అవకాశం బీసీ కార్పొరేషన్లకుంది. ఎవరి ష్యూరిటీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ష్యూరిటీతో బీసీలకు ఈ సంస్థ రుణాలిస్తుంది.
56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల వివరాలు
1. రజక: రంగన్న (అనంతపురం)
2. కురుబ : కోటి సూర్యప్రకాశ్ బాబు (అనంతపురం)
3. తొగట : గడ్డం సునీత (అనంతపురం)
4. కుంచిటి వక్కలిగ: డా.నళిని(అనంతపురం)
5. వన్యకుల క్షత్రియ: కె. వనిత (చిత్తూరు)
6. పాల ఎకరి: టి. మురళీధర్ (చిత్తూరు)
7. ముదళియర్ : తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు)
8. ఈడిగ : కె.శాంతి (చిత్తూరు)
9. గాండ్ల : భవానీ ప్రియ (తూ.గో)
10. పెరిక : పురుషోత్తం గంగాభవానీ (తూ.గో)
11. అగ్నికుల క్షత్రియ: బందన హరి (తూ.గో)
12. అయ్యారక: రాజేశ్వరం (తూ.గో)
13. షేక్ : షేక్ యాసీన్ (గుంటూరు)
14. వడ్డెర: దేవల్లి రేవతి (గుంటూరు)
15. కుమ్మరి శాలివాహన: పురుషోత్తం(గుంటూరు)
16. కృష్ణ బలిజ/పూసల: కోలా భవాని (గుంటూరు)
17. యాదవ: హరీష్‌కుమార్ (కడప)
18. నాయిబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య (కడప)
19. పద్మశాలీ: విజయలక్ష్మి (కడప)
20.నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్‌బి (కడప)
21. సాగర ఉప్పర : గనుగపేట రమణమ్మ (కడప)
22. విశ్వ బ్రాహ్మణ : తోలేటి శ్రీకాంత్ (కృష్ణా)
23. గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా)
24. వడ్డెలు: సైదు గాయత్రి సంతోష్ (కృష్ణా)
25. భట్రాజు: గీతాంజలి దేవి (కృష్ణా)
26. వాల్మీకి బోయ: డా.మధుసూదన్ (కర్నూలు)
27. కుమి/కరికల భక్తుల: శారదమ్మ (కర్నూలు)
28. వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్ (కర్నూలు)
30. బెస్త : తెలుగు సుధారాణి (కర్నూలు)
31. ముదిరాజ్: వెంకటనారాయణ (నెల్లూరు)
31. జంగం: ప్రసన్న (నెల్లూరు)
32. బొందిలి : కిషోర్ సింగ్ (నెల్లూరు)
33. ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు)
34. చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్‌కుమార్ (ప్రకాశం)
35. ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి(ప్రకాశం)
36. దేవాంగ : సురేంద్రబాబు (ప్రకాశం)
37. మేదర : లలిత నాంచారమ్మ(ప్రకాశం)
38. కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం)
39. కళింగ కోమటి/ కళింగ వైశ్య: సూరిబాబు (శ్రీకాకుళం)
40. రెడ్డిక: లోకేశ్వరరావు (శ్రీకాకుళం)
41. పోలినాటి వెలమ: కృష్ణవేణి (శ్రీకాకుళం)
42. కురకుల/పొండర: రాజపు హైమావతి(శ్రీకాకుళం)
43. శ్రీసైన: చీపురు రాణి( శ్రీకాకుళం)
44. మత్స్యకార : కోలా గురువులు (విశాఖ)
45. గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ)
46.నగరాల: పిల్లా సుజాత (విశాఖ)
47. యాత: పి.సుజాత (విశాఖ)
48. నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ)
49. తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం)
50. కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు(విజయనగరం)
51. శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం)
52 .దాసరి: రంగుముద్రి రమాదేవి (విజయనగరం)
53. సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి (ప.గో)
54. శెట్టి బలిజ: తమ్మయ్య (ప.గో)
55. అత్యంత వెనుకబడిన వర్గాల: వీరన్న (ప.గో)
56. అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్ రావు (ప.గో)
ఈ కార్పొరేషన్లకు గానూ 56 మంది చైర్మన్లుగా, డైరెక్టర్లుగా 672 మంది పదవులు చేపడుతున్నారు. బీసీల్లోని 139 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. అయితే కొన్ని కులాల జనాభా 500 కంటే తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 30 వేలకు తగ్గకుండా జనాభా ఉంటే బాగుంటుందని భావించి.. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.