Students Drowned: మహాబలిపురం బీచ్ లో ఏపీ విద్యార్ధుల గల్లంతు, ఒకరు మృతి, మరో నలుగురికోసం గాలింపు, కాలేజీ టూర్ కోసం వెళ్లి విషాదాంతం
కాలేజీ తరఫున తమిళనాడు (Tamilnadu) టూర్‌కి వెళ్లింది 18 మంది విద్యార్థుల బృందం. సరదాగా ఈత కోసం సముద్రంలో దిగారు విద్యార్థులు. వారిలో 9 మంది సముద్రంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని.. నలుగురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు.
Chennai, March 02: తమిళనాడు మహాబలిపురం బీచ్ (Mahabalipuram Beach) వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది. నలుగురు తెలుగు విద్యార్థులు సముద్రంలో గల్లంతు (Students Drowned) అయ్యారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. ఈ నలగురూ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కాలేజ్‌లో చదివే విద్యార్థులుగా తెలుస్తోంది. కాలేజీ తరఫున తమిళనాడు (Tamilnadu) టూర్‌కి వెళ్లింది 18 మంది విద్యార్థుల బృందం. సరదాగా ఈత కోసం సముద్రంలో దిగారు విద్యార్థులు. వారిలో 9 మంది సముద్రంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని.. నలుగురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. మరో విద్యార్థి మృతదేహం వెలికితీశారు. ఇంకా నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Mahasena Rajesh: ఎన్నికల బరి నుంచి తప్పుకున్న టీడీపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్
ఇందులో మౌనిష్, విజయ్, ప్రభు ఒక్కసారిగా గల్లంతైనట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. వీరి స్వస్థలాలు.. మౌనిష్-బంగారుపాలెం, విజయ్- సదుం, ప్రభు-పులిచెర్ల గ్రామంగా తెలుస్తోంది. విద్యార్థుల గల్లంతు సమాచారంతో తల్లిదండ్రుల్లో..బంధువుల్లో ఆందోళన నెలకొంది.
(The above story first appeared on LatestLY on Mar 02, 2024 09:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

