తెలంగాణ
Cold Wave in Telangana: వామ్మో అక్కడ ఏకంగా 8 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్, తెలంగాణలో రోజు రోజుకూ తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
VNSపది రోజులుగా సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు అయ్యింది. చలి తీవ్రతతో కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఉదయం బయటికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు.
KTR Responds On Lagacherla: లగచర్లలో ప్రభుత్వం వెనుకడుగు తప్పకుండా బీఆర్ఎస్ విజయమే! తెలంగాణ దీక్షా దివస్ లో కేటీఆర్ కీలక కామెంట్లు
VNSరియల్ ఎస్టేట్ వ్యాపారికి, పాలన తెలియదు. మీ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ దందా చేయటం మాత్రమే తెలుసు. మరొక రూపంలో మీ భూములు కావాలంటూ మళ్లీ వస్తాడు. జాగ్రత్తగా ఉండాలే. ఈ ప్రభుత్వంపై ప్రతిఘటన మాత్రమే మనకు ఉన్న గత్యంతరం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Telangana Shocker: దారుణం, వివాహేతర సంబంధం మోజులో భర్తను హత్య చేసిన భార్య , నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన
Hazarath Reddyనాగర్ కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ కసాయి భార్య. 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు కీర్తి, జగదీష్. బిజినపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంల అటెండర్ గా జగదీష్ పనిచేస్తున్నారు. అయితే నాగరాజుతో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధం పెట్టుకుంది కీర్తి
Telangana: వీడియో ఇదిగో, బూతులతో రెచ్చిపోయి తిట్టుకున్న ఆర్టీసీ డ్రైవర్, ట్రాఫిక్ పోలీస్, సికింద్రాబాద్ రేతిఫిల్ బస్ స్టాండ్ వద్ద ఘటన
Hazarath Reddyఆర్టీసీ డ్రైవర్, ట్రాఫిక్ పోలీస్ బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సికింద్రాబాద్ రేతిఫిల్ బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్‌కు అడ్డంగా ఉంది పక్కకు తీయాలని చెప్పిన ట్రాఫిక్ పోలీసును తిట్టిన మిధాని బస్ డిపో డ్రైవర్.. తానేం తక్కువ కాదన్నట్లు బూతు పురాణం అందుకున్న ట్రాఫిక్ పోలీస్..
Komatireddy: గురుకుల సిబ్బందిపై కోమటిరెడ్డి ఆగ్రహం..నాసిరకం వంటకాలు, భోజనంలో నాణ్యత లేదని అధికారులపై ఫైర్..
Arun Charagondaగురుకుల సిబ్బందిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్ చార్జీలు పెంచినప్పటికీ భోజనంలో నాణ్యత లేదంటూ ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం, కూరలు, సాంబారు పెరుగు నాసిరకంగా ఉన్నాయంటూ అధికారులపై ఆగ్రహం చేశారు.
Thummala Nageswara Rao: రైతు బందు బంద్ చేసే ఆలోచనలో ప్రభుత్వం.. రైతు బంధు స్థానంలో బోనస్...మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు...రైతులకు మేలు చేసే విధంగా ఆలోచిస్తామని కామెంట్స్
Arun Charagondaరైతుబంధుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు బంద్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. రైతుబంధు కంటే బోనస్ బాగుందని రైతులు అంటున్నారు...ఎకరానికి రూ.15 వేల వరకు బోనస్ వస్తుందని రైతులు చెబుతున్నారు.. ఏది రైతుకు మేలు అంటే అదే చేస్తాము అన్నారు.
Telangana: డివైడర్‌ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు...20 మందికి తీవ్ర గాయాలు, ఘటన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులు..వీడియో ఇదిగో
Arun Charagondaసంగారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు డివైడర్‌పైకి దూసుకెళ్లింది,ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
Harishrao: కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు..దొంగలను తిరిగి పార్టీలోకి చేర్చుకోమన్న హరీశ్ రావు...కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరం కాదు..టీడీపీతో కూడా జై తెలంగాణ అనిపించామన్న హరీశ్
Arun Charagondaఏ శాఖ కావాలి అంటే నాకు తెలంగాణ శాఖ కావాలని కేసీఆర్ అడిగాడు..నేను శాఖ కోసం, మంత్రి పదవి కోసం రాలేదు.. తెలంగాణ కోసం వచ్చాం అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకంలో రాశారు అని తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట దీక్షా దివస్‌లో మాట్లాడిన హరీశ్ రావు..తెలుగుదేశం పార్టీతో కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్ అన్నారు.
Telangana: సీఎం రేవంత్ రెడ్డి విగ్రహంతో మాజీ హోంగార్డు దీక్ష, హోంగార్డు వ్యవస్థను పర్మినెంట్ చేయాలని డిమాండ్..వీడియో ఇదిగో
Arun Charagondaహోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, బెల్లంపల్లి పట్టణంలోని తన నివాసంలో రాష్ట్ర హోంగార్డు జేఏసీ చైర్మన్ సకినాల నారాయణ దీక్ష చేపట్టారు.వచ్చేనెల 6వ తేదిన తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్ వ్యవస్థ 62వ ఆవిర్భవ దినోత్సవాలు ప్రభుత్వం అధికార లాంచనాలతో జరపాలని, హోంగార్డ్ వ్యవస్థను పర్మనెంట్ చేయాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరసన తెలియజేసినందుకు సకినాల నారాయణను ఉద్యోగం నుండి తొలగించింది కేసీఆర్ సర్కార్.
Nagarkurnool: మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత, తిమ్మాజీపేట స్కూల్‌లో ఘటన..వెంటనే డాక్టర్లను పిలిచి చికిత్స చేయించిన టీచర్లు
Arun Charagondaమధ్యాహ్న భోజనం తిని నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గోరిట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. టమాటో రైస్, గుడ్డు తిన్న నలుగురు విద్యార్థులు వాంతులు చేసుకోగా.. వెంటనే ఉపాధ్యాయులు వైద్యులను పిలిపించి పాఠశాలలోనే చికిత్స చేయించారు.
Lagacharla: లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకున్న ప్రభుత్వం, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaకాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ నోటిఫికేషనన్ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషనన్ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
Robbery In Wine Shop: ఘరానా దొంగలు..ఏకంగా వైన్స్ షాప్ గోడకే కన్నం వేసి దొంగతనం, శంషాబాద్ మండలం పాలమాకుల వైన్స్‌లో ఘటన
Arun Charagondaవైన్స్ షాప్ గోడకు కన్నం పెట్టి మద్యం బాటిళ్లు చోరీ చేశారు దొంగలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని SVB లక్ష్మీనరసింహ వైన్స్ షాప్ గోడకు తెల్లవారుజామున దొంగలు కన్నం పెట్టి మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. మాస్కులు ధరించి లోపలికి వెళ్లి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు పోలీసులు.
Asifabad: ఆసిఫాబాద్‌లో పులి సంచారం, మహిళపై దాడి..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి...మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా..వీడియో
Arun Charagondaపులి దాడిలో మహిళ మృతి చెందింది. పత్తి చేనులో పత్తి ఏరుతుండగా లక్ష్మి అనే మహిళపై పులి దాడి చేయగా ఈ దాడిలో మహిళ మృతి చెందింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో ఘటన చోటు చేసుకోగా ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు.
Telangana: గురుకులంలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..షాక్ తిన్న వైనం, రోజు వారి కూలీలతో వంట..కుళ్లిన గుడ్లు,నీళ్ల సాంబార్...వీడియో ఇదిగో
Arun Charagondaగురుకులంలో తనిఖీకి వెళ్లి ఖంగుతిన్నారు ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని మొగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలలో తనిఖీకి వెళ్లారు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ. వంట మనిషి లేకపోవడంతో రోజువారీ కూలీలతో వంట చేయిస్తున్నారు. స్టోర్ రూంలో కుళ్లి బూజు పట్టిన ఆలుగడ్డలు, ఐఎస్ఐ మార్క్ లేని ఉప్పు ప్యాకెట్లు దర్శనం ఇచ్చాయి.
Child Heart Attack: గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతి.. మంచిర్యాల జిల్లాలో ఘోరం
Rudraడెబ్బై, ఎనభై ఏండ్ల వయసులో రావాల్సిన గుండెపోటు ఇప్పుడు చిన్నరుల్లోనూ కనిపిస్తున్నది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామంలోనూ ఇదే జరిగింది.
Telangana Diksha Divas: తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు.. దీక్షా దివస్, కేసీఆర్ చచ్చుడో - తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో ఆమరణ దీక్ష..రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌లో బీఆర్ఎస్ శ్రేణులు
Arun Charagondaతెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ నవంబర్ 29, 2009న చేపట్టిన నిరాహార దీక్షను మరోసారి గుర్తు చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా ఏర్పాట్లు చేశారు.
Nagachaitanya-Sobhita Haldi Function: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్.. ఫోటోలు వైరల్
Rudraఅక్కినేని హీరో నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్ వేడుకలు ఎంతో అంగరంగ వైభోగంగా మొదలయ్యాయి. హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
AP Cabinet Meeting: డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ.. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం
Rudraఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం డిసెంబర్ 4వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది.
AP Secretariat Employees: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే? (వీడియో)
Rudraఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టయ్యారు. వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేశారన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు.