Pallavi Prashanth Bailed: ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ కు బెయిల్ మంజూరు, ఆదివారం పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశం
Bigg Boss 7 Winner Pallavi Prashant shifted to Chanchal Guda Jail

Hyderabad, DEC 22: బిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌కు (Pallavi Prashanth) నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. పోలీసుల ముందు విచారణకు ఆదివారం హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అలాగే.. రూ.15 వేల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు తెలిపింది.

Pallavi Prashanth As Bigg Boss 7 Telugu winner: బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, రన్నరప్ గా అమర్ దీప్.. 

బిగ్‌బాస్‌ (Bigg Boss) ఫైనల్‌ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ధ్వంసం, దాడి ఘటనలో ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడు మహావీర్‌ను (Mahaveer) పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ఇద్దరికీ 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఇద్దరినీ జూబ్లీహిల్స్‌ పోలీసులు చంచల్‌గూడ జైలుకు (Chanchalguda Jail) తరలించారు.