Newdelhi, Feb 26: ప్రాణాంతకమైన క్యాన్సర్ (Cancer) వ్యాధిని వంటింట్లో నిత్యం ఉపయోగించే మసాలా దినుసులతో (Indian Spices) నయం చేయొచ్చు. ఈ మేరకు మద్రాస్ ఐఐటీ (Madras IIT) పరిశోధకులు నిరూపించారు. అంతేకాదు దీనిపై తాజాగా పేటెంట్ కూడా పొందారు. 2028 నాటికి ఈ మందును మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జంతువులపై ఈ ఔషధంతో చేసిన ప్రయోగాలు సానుకూల ఫలితాలిచ్చాయి. త్వరలోనే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నారు.
IIT-Madras researchers patent use of Indian spices to treat cancer; clinical trials to begin soon#IITMadras #Cancer #CancerResearch @iitmadras https://t.co/UnNsxLe00k
— NewsDrum (@thenewsdrum) February 25, 2024
ఏయే క్యాన్సర్లకు విరుగుడు అంటే?
ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్దపేగు, గర్భాశయ, నోటి, థైరాయిడ్ క్యాన్సర్లను మసాలాల నుంచి సేకరించిన నానోమెడిసిన్‌తో నయం చేయవచ్చని ఐఐటీ మద్రాస్ పరిశోధకులు చెబుతున్నారు.