New Delhi, Sep 28: కరోనా కాలంలో ద్విచక్ర వాహనాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఫెడరల్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. కేవలం ఒక్క రూపాయికే బైక్ బుక్ (Book two-wheeler at Re 1) చేసుకోవచ్చంటూ తన కస్టమర్లకు ఊరటనిచ్చింది. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు (Federal Bank customers) డెబిట్ కార్డు ద్వారా కేవలం ఒక్క రూపాయి చెల్లించి, మిగిలిన సొమ్మును ఈఎంఐ చెల్లింపు అవకాశంతో (rest via debit card EMI) కొనుగోలు చేయవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఎంపిక చేసిన హీరో, హోండా, టీవీఎస్ షోరూంలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
దీంతో పాటుగా ఫెస్టివల్ ఆఫర్‌గా ఎంపిక చేసిన హోండా మోటార్ సైకిల్ షోరూంల ద్వారా డెబిట్ కార్డు ఈఎంఐతో బైక్ కొనుగోలు చేసినవారికి 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను సైతం బ్యాంక్ (Federal Bank) అందిస్తోంది. హోండా మోటార్ సైకిల్ షోరూమ్‌ల నుండి ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేవారికి పండుగ ఆఫర్‌గా5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. 500సీసీ ఇంజన్ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లపై 17 శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది. 3, 6, 9,12 నెలలకు ఈఎంఐను ఎంచుకునే అవకాశాన్ని తమ ఖాతాదారులకు ఫెడరల్ బ్యాంక్ కల్పిస్తోంది.
ఈఎంఐ అర్హతను తెలుసుకోవడానికి ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ‘DC-SPACE-EMI’ అని టైప్ చేసి 5676762 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. అలాగే 7812900900 నంబరుకు మిస్డ్‌కాల్ ఇచ్చి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. కాగా భారతదేశం అంతటా 36,000 దుకాణాలలో వినియోగదారుల డ్యూరబుల్స్ కొనుగోలు కోసం బ్యాంక్ డెబిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయం అందిస్తోంది. కాగా ఈకామర్స్ పోర్టల్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లపై కూడా ఇటీవల బ్యాంకు ఈఎంఐ ఆఫర్ అందించడం ప్రారంభించింది.