Ola Electric Car (Photo Credits: Twitter)

New Delhi, August 16: క్యాబ్ సేవల సంస్థ ఓలా(Ola) కు చెందినా ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric).. తాజాగా ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలోకి ప్రవేశిస్తోంది. 2024 నాటికి తొలి మోడల్‌ (First Model)ను ఆవిష్కరించనున్నట్టు ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవీష్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) తెలిపారు. రూ. 1 లక్ష నుంచి రూ. 50 లక్షల ధరల రేంజిలో ఎలక్ట్రిక్‌ టూ–వీలర్లు, కార్ల శ్రేణిని అందుబాటులోకి తేవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు.

రూ. 2.85 లక్షల ధరతో బీఎండబ్ల్యూ నుంచి కొత్త స్టోర్ట్స్ బైక్, BMW G 310 RR పేరుతో విడుదల చేసిన కంపెనీ, జీ 310 ఆర్‌ఆర్‌ బైక్ ఫీచర్లు ఇవే..

ఇక కారు ఫీచర్ల గురించి చెబుతూ.. ఓలా ఎలక్ట్రిక్‌ కారుకు ఒకసారి చార్జి చేస్తే 500 కిలోమీటర్ల పైగా నడిచే సామర్థ్యం (Capacity) ఉండగలదని, 4 సెకన్లలోనే 0–100 కి.మీ. వేగాన్ని అందుకోగలదని అగర్వాల్‌ చెప్పారు. ఓలా గతేడాదే ఎస్‌1, ఎస్‌1 ప్రో మోడల్స్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్‌ కార్ల ప్రాజెక్టు కోసం 1,000 మందిని తీసుకుంటున్నట్లు అగర్వాల్‌ తెలిపారు.